దేవుడు పరిశుద్దుడు (God is Holy)
1) దేవుడు పరిశుద్దుడు అనేది ఆయన స్వభావంలోనే ఉన్నది
దేవుడు తన స్వభావములోనే పరిశుద్దుడు. పరిశుద్ధత అనేది దేవుడు కలిగియున్న ఒక గుణం మాత్రమే కాదు; అది ఆయన స్వభావమే. దేవుడు సంపూర్ణ పవిత్రుడు, ఆయనలో పాపమునకు, అపవిత్రతకు ఏమాత్రం స్థానం లేదు. యెషయా 6:3; ప్రకటన 4:8.
2) దేవుడు పరిశుద్దుడు అనగా పాపానికి అతీతుడు
దేవునిలో పాపము లేదు. దేవుడు పాపము చేయడు, పాపమును ఇష్టపడడు, పాపముతో సహవాసము చేయడు. హబక్కూకు 1:13; 1 యోహాను 1:5
3) దేవుడు పరిశుద్దుడు అనగా లోకమునకు వేరుగా ఉన్నవాడు
దేవునికి సమానుడు ఎవ్వరూ లేరు. "పరిశుద్దుడు" అంటే వేరుగా ఉంచబడినవాడు. దేవుడు సృష్టికి అతీతుడు, మహిమాన్వితుడు. 1 సమూయేలు 2:2; నిర్గమకాండము 15:11
4) దేవుడు పరిశుద్దుడు అనగా నీతియందు పరిపూర్ణుడు
దేవుని పరిశుద్ధత ఆయన న్యాయములో ప్రత్యక్షమగును. ఆయన కార్యములన్నియు నీతియుక్తమైనవే; అన్యాయము ఆయనయొద్ద లేదు. ద్వితీయో 32:4; కీర్తనలు 145:17
5) దేవుడు పరిశుద్ధుడు అనగా పాపాన్ని ద్వేషించువాడు
దేవుని పరిశుద్ధత పాపాన్ని సహించదు. పాపమునకు దేవుని సన్నిధిలో స్థలము లేదు. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. కీర్తనలు 5:4-5; సామెతలు 6:16-19,15:9
6) దేవుడు పరిశుద్ధుడు అనగా పరిశుద్ధతను కోరువాడు
పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ ప్రజలను కోరుచున్నాడు. తన ప్రజలు కూడా పరిశుద్ధులై జీవింపవలెనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు.లేవీయకాండము 19:2; 1 పేతురు 1:15–16
7) దేవుడు పరిశుద్దుడు అనగా పాపాన్ని తీర్పు తీర్చువాడు
పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు. ఆయన తీర్పు ఎల్లప్పుడూ నీతిమంతమైనది. దేవుని పరిశుద్ధత పాపమును శిక్షించకుండ ఉండదు. రోమా 6:23; నహూము 1:3
8) దేవుడు పరిశుద్ధుడు అనగా క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచువాడు
పరిశుద్ధత క్రీస్తులోనే లభించును. యేసుక్రీస్తు పాపరహిత జీవితాన్ని జీవించి, తన బలి ద్వారా మనలను పరిశుద్ధపరచుటకు మార్గం తెరిచాడు. హెబ్రీ 7:26, 10:10; 1 కొరింథీ 1:30
9) దేవుడు పరిశుద్దుడు అనగా ఆరాధనకు అర్హుడు
దేవదూతలు నిరంతరం "పరిశుద్దుడు" అని దేవుని స్తుతిస్తున్నారు. దేవుని పరిశుద్ధత ఆయనను సమస్త మహిమకు, స్తుతికి యోగ్యునిగా చేయుచున్నది. కీర్తన 99:9; ప్రకటన 15:4
10) దేవుడు పరిశుద్ధుడు అనేది ఆయన సన్నిధి పరిశుద్ధతను కలుగజేయును
దేవుని పరిశుద్ధత విశ్వాసిని రూపాంతరం చేస్తుంది. దేవుని పరిశుద్దతను గ్రహించినవారు పాపాన్ని విడిచి దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. 2 కొరింథీ 3:18; హెబ్రీ 12:14, రోమా12:1-2