దేవుడు నమ్మదగినవాడు
1) దేవుడు నమ్మదగినవాడు అనేది ఆయన స్వభావంలోనే ఉన్నది
దేవుడు నమ్మదగినవాడిగా ఉండడానికి కారణం ఆయన చేసే కార్యాలు మాత్రమే కాదు, ఆయన స్వభావమే. దేవుని నమ్మదగిన స్వభావం ఎన్నటికీ మారదు. ఆయన మార్పులేనివాడు, సత్యస్వరూపి, పరిశుద్ధుడు. అందువల్ల ఆయనను సంపూర్ణంగా విశ్వసించవచ్చు. మలాకీ 3:6; యాకోబు 1:17; ద్వితీయోపదేశకాండము 32:4
2) దేవుడు నమ్మదగినవాడు అనగా మాట తప్పనివాడు
దేవుడు పలికిన మాటను ఎన్నడూ వెనక్కి తీసుకోడు. ఆయన చెప్పినది తప్పక నెరవేరుతుంది. దేవుడు అసత్యము చెప్పడు, మాట తప్పడు. సంఖ్యా 23:19; తీతు1:2; యెషయా 55:11
3) దేవుడు నమ్మదగినవాడు అనగా వాగ్దానములను నెరవేర్చువాడు
ఆలస్యం కనిపించినా దేవుడు తన సమయానికి తన వాగ్దానాలన్నిటిని నెరవేర్చుతాడు. దేవుని వాగ్దానాలు ఎన్నటికీ విఫలం కావు. యెహోషువ 21:45; 2 కొరింథీ 1:20; హెబ్రీ 10:23
4) దేవుడు నమ్మదగినవాడు అనగా కష్ట కాలంలో ఆశ్రయం
శ్రమలు, శోధనలు, భయాల మధ్య దేవుడు తన ప్రజలకు ఆశ్రయమై ఉంటాడు. కష్టకాలంలో మనుష్యుల కంటే దేవుడు మనకు సురక్షితమైన శరణాలయం. కీర్తన 46:1; నహూ 1:7; యెష 41:10
5) దేవుడు నమ్మదగినవాడు అనగా పాపములను క్షమించు వాడు
నిజమైన పశ్చాత్తాపంతో ఆయన వద్దకు వచ్చిన వారిని దేవుడు క్షమించి శుద్ధి చేస్తాడు. దేవుని క్షమాపణ సంపూర్ణమైనది. 1 యోహాను 1:9; కీర్తనలు 103:12; మీకా 7:18–19
6) దేవుడు నమ్మదగినవాడు అనగా దుష్టత్వం నుండి కాపాడి స్థిరపరచువాడు
శోధనలలో దేవుడు తన పిల్లలను ఆధ్యాత్మికంగా బలపరచి దుష్టుని నుండి కాపాడుతాడు. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు. 2 థెస్సలొ 3:3; 1 పేతురు 5:10
7) దేవుడు నమ్మదగినవాడు అనగా ప్రార్థనలకు స్పందించువాడు
దేవుడు తన చిత్తప్రకారం తన పిల్లల ప్రార్థనలను ఆలకించి సమాధానం ఇస్తాడు. దేవుడు ప్రార్థనలను నిర్లక్ష్యం చేయడు. 1 యోహాను 5:14–15; యిర్మీయా 33:3; కీర్తనలు 145:18–19
8) దేవుడు నమ్మదగినవాడు అనగా మార్గదర్శకత్వం చూపేవాడు
ప్రతి నిర్ణయంలో దేవుడు తనను వెదికేవారిని సరైన మార్గంలో నడిపిస్తాడు. దేవుని నడిపింపు ఎప్పుడూ ఉత్తమమైనది. సామెతలు 3:5–6; కీర్తనలు 32:8; యెషయా 30:21
9) దేవుడు నమ్మదగినవాడు అనగా అనుదినం నమ్మదగినవాడు
దేవుని విశ్వసనీయత ఒక రోజు లేదా ఒక పరిస్థితికి మాత్రమే పరిమితం కాదు. దేవుని విశ్వాస్యత ప్రతి ఉదయం నూతనంగా అనుభవించబడుతుంది. విలాప 3:22–23; కీర్తనలు 36:5; హెబ్రీ 13:8
10) దేవుడు నమ్మదగినవాడు అనేది ఆరాధనకు నడిపిస్తుంది.
దేవుని విశ్వాస్యతను అనుభవించినవారు సహజంగానే ఆయనను స్తుతించి ఆరాధిస్తారు. ఆయన నమ్మదగినవాడని తెలుసుకోవడం మన హృదయాన్ని కృతజ్ఞతతో నింపుతుంది. దేవుని విశ్వాస్యత ఆరాధనకు కారణం. కీర్తన 100:5; 89:1–2; ప్రక 4:11