యాకోబు పత్రిక 3వ అధ్యాయం విభజన (Outline)
I. బోధకుల బాధ్యత – 3:1–2
II. నాలుక యొక్క శక్తి – 3:3–5a
III. నాలుక యొక్క ప్రమాదం – 3:5b–8
IV. నాలుకలోని వైరుధ్యం – 3:9–12
V. నిజమైన జ్ఞానానికి పరీక్ష – 3:13
VI. రెండు రకాల జ్ఞానము – 3:14–18
భూసంబంధ జ్ఞానము
పరలోక జ్ఞానము
ముఖ్య వచనం: యాకోబు 3:13 "మీలో జ్ఞానియు వివేకియు ఎవడు? అతడు తన సత్ప్రవర్తనను జ్ఞానమునకు తగిన సాత్వికముతో కనుపరచవలెను."
1 నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి.
2 అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై,తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును
బోధకులకు ఎక్కువ బాధ్యత
దేవుని కఠినమైన తీర్పు
అందరూ అనేక విషయాలలో తప్పుతారు
నాలుకను అదుపు చేసేవాడు తన శరీరమంతటినీ అదుపు చేయగలడు
3 గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా
4 ఓడలనుకూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును.
5 ఆలాగుననే నాలుకకూడ చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును!
చిన్నది
పెద్ద గుర్రాన్ని నియంత్రిస్తుంది
చిన్నది
పెద్ద ఓడను నడిపిస్తుంది
చిన్న అవయవం
గొప్ప విషయాలను ప్రభావితం చేస్తుంది
బోధ: చిన్న అవయవమైన నాలుక జీవితాన్ని దిశానిర్దేశం చేస్తుంది.
6 నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీర మునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును.
7 మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతిచేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని
8 యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే.
అధర్మ ప్రపంచం
శరీరమంతటిని అపవిత్రం చేస్తుంది
జీవిత గమనాన్ని నాశనం చేస్తుంది
నరకాగ్నిచేత మండించబడుతుంది
అదుపులేని చెడు
ప్రాణాంతక విషముతో నిండి ఉంది
9 దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము.
10 ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండ కూడదు.
11 నీటిబుగ్గలో ఒక్క జెలనుండియే తియ్యని నీరును చేదునీరును ఊరునా?
12 నా సహోదరులారా, అంజూరపుచెట్టున ఒలీవ పండ్లయినను ద్రాక్షతీగెను అంజూరపు పండ్లయినను కాయునా? అటువలెనే ఉప్పు నీళ్లలోనుండి తియ్యని నీళ్లును ఊరవు.
ఊట (3:11)
అంజూరపు చెట్టు (3:12a)
ద్రాక్ష తీగ (3:12b)
ఉప్పు నీటి ఊట (3:12c)
బోధ: ఒకే మూలం నుండి రెండు విరుద్ధ ఫలితాలు రావు. అలాగే విశ్వాసి మాటలు కూడా పరిశుద్ధంగా ఉండాలి.
13 మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.
మంచి ప్రవర్తన కలిగినవాడు
సాత్వికత కలిగినవాడు
వినయముతో జీవించువాడు
ప్రవర్తనలో కనిపించాలి
వినయములో వ్యక్తమవాలి
14 అయితే మీ హృదయములలో సహింపనలవికాని మత్సరమును వివాదమును ఉంచుకొనినవారైతే అతిశయపడవద్దు, సత్య మునకు విరోధముగా అబద్ధమాడవద్దు.
15 ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదికాక భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై యున్నది.
16 ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.
చేదైన అసూయ
స్వార్థము
అబద్ధము
లోక సంబంధము
శరీర సంబంధము
దయ్య సంబంధము
గందరగోళము
చెడు కార్యములు
17 అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనిన
పరిశుద్ధమైనది
సమాధానకరమైనది
మృదువైనది
విధేయమైనది
కనికరముతో నిండినది
మంచి ఫలములతో నిండినది
పక్షపాతము లేనిది
కపటము లేనిది
18 నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.